Home తాజా వార్తలు రాజేంద్ర కుజూర్ లో ఏనుగుల గుంపు హల్ చల్

రాజేంద్ర కుజూర్ లో ఏనుగుల గుంపు హల్ చల్

Elephant

రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం రాజేంద్ర కుజూర్ ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల అటవీ నుంచి వచ్చి పలు గ్రామాలపై దాడి చేస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత పదిహేను రోజుల నుంచి ఏనుగులు సంచరిస్తుండటంతో  10 గ్రామాల పిల్లలు పాఠశాలల వెళ్లడానికి జంకుతున్నారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చిన ఇప్పటివరకు వారి నుంచి ఎటవంటి స్పందన లేదని పలు గ్రామల ప్రజలు వాపోయారు. ఇప్పటికైన అటవీ శాఖ అధికారులు ఏనుగులు గుంపును పట్టుకొని అడవిలోకి తరలించాలని కోరుతున్నారు.