Home తాజా వార్తలు టెక్కీ అదృశ్యం…

టెక్కీ అదృశ్యం…

Female Software Engineer Missing in Hyderabad

హైదరాబాద్: కొత్తగా పెళ్లైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన కంచన్‌బాగ్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చంపాపేట పరిధిలోని రాజిరెడ్డినగర్‌కు చెందిన ప్రదీప్ విశ్వనాథం, వాసంతిలకు 2నెలల కింద వివాహమైంది. దంపతులిద్దరూ ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే ఈ నెల 2న వాసంతి ఉదయం 9 గంటల ప్రాంతంలో హైటెక్‌సిటీలోని ఓ కంపెనీకి వెళ్లింది. కానీ, సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ప్రదీప్ బంధువులు, ఆమె స్నేహితుల ఇళ్లలో వాకాబు చేశాడు. కానీ వాసంతి ఆచూకీ దొరకలేదు. దాంతో ప్రదీప్ పోలీసులకు ఆశ్రయించాడు. ప్రదీప్ సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.