Home కరీంనగర్ యువతి ఆత్మహత్య

యువతి ఆత్మహత్య

Female suicide for failing in degree outcomes
హుజూరాబాద్: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనోవేదనకు గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన మిసర గండ్ల రవిందర్ లక్ష్మీలకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె మిసర గండ్ల రచన(20) పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో ఫెయిల్ అయింది. తండ్రి రవిందర్ డిగ్రీ ఫలితాల గురించి అడుగగా మనోవేధన గురై సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో హుటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.