Search
Friday 21 September 2018
  • :
  • :

‘మిస్ ఇండియా’గా తమిళ పొన్ను

Femina Miss India 2018 Crowned Anukreethy Vas From Tamil Nadu

ముంబయి: ఫెమీనా మిస్‌ ఇండియా 2018 పోటీల్లో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల కాలేజీ విద్యార్థిని అనుక్రీతి వాస్‌ మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకుంది. 30 మంది ఫైనలిస్టులతో పోటీ పడి అనుక్రీతి కిరీటం కైవసం చేసుకుంది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహార్‌, ఆయుష్మాన్‌ ఖురానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2017 మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లార్, బాలీవుడ్‌ నటులు మలైకా అరోరా ఖాన్‌, బాబీ డియోల్‌, కునాల్‌ కపూర్‌, క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌‌,  కెఎల్‌ రాహుల్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఫైనల్ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా, సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చిన అనుకీర్తి అందాల సుందరి కిరీటాన్ని ఎగరేసుకుపోయింది.  హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మొదటి రన్నరప్‌గా, ఎపికి చెందిన శ్రియా రావు‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ అందాల తారలు మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనుక్రీతి 2018 మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

Comments

comments