Home కరీంనగర్ కదిలిన అవినీతి డొంక..!

కదిలిన అవినీతి డొంక..!

సహకార సంఘంలో అక్రమాలు
రైతుల డబ్బులు స్వాహా
ఫలితంగా రైతులకందని రుణాలు

Corruption_manatelangana2మన తెలంగాణ/మంచిర్యాల: కాలం కాటేసి… విలవిల్లా డుతున్న రైతులకు అక్రమాలకు పాల్పడుతున్న అధికారి రూపంలో మరో షాక్ తగిలింది. ఎరువులు రావడం లేదు మహా ప్రభో అంటూ మొర పెట్టుకోవడంతో ‘మన తెలం గాణ’ దినపత్రికలో ‘ఎరువుల కోసం రైతన్న నిరసన’ పేరిట ప్రచురితమైన కథనంతో తీగలాగితే డొంక కదిలింది. సహకారంలో అవినీతి జలగ వ్యవహారం బయటపడింది. రైతులు చెల్లించిన డబ్బులను మార్క్‌ఫెడ్ చెల్లించకపోవడం వల్లనే ఎరువులు రాలేదనే విషయం తేటతెల్లమైంది. స్వాహాకు పాల్పడ్డ సదరు అధికారి నిధులను మింగినట్లు రాతపూర్వకంగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు.
బయటపడుతున్న అక్రమాలు
కెరమెరి సహకార సంఘంలో చోటు చేసుకున్న అక్ర మాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గురువారం ఎరువుల కోసం రైతులు నిరసన దిగిన విషయాన్ని బయ టకు పొక్కనీయకుండా సంఘంలోని అధికారులు శత విధాలా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అందరినీ ప్రస న్నం చేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. తెల్ల వారగానే మన తెలంగాణలో నిరసన కథనం రావడంతో అసలు జరిగిన వ్యవహారం బయటపడింది. సంస్థలో పనిచేస్తున్న ఉన్న అధికారి ఎరువుల కోసం మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ.5.54 లక్షలను తన సొంతం కోసం వాడు కున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు తాను చేసిన తప్పును ఒప్పుకుంటూ గత నెల 14న రాతపూర్వకంగా జూలై 20వ తేదీలోగా వాడుకున్న డబ్బు లను తిరిగి చెల్లించి ఎరువులు వచ్చేలా చేస్తా నని రాసి ఇచ్చాడు. గడువు దాటి పది రోజులు గడుస్తున్నా పైకం చెల్లించకపోవడంతో ఎరు వులు రాలేదు. దీంతో ఆగ్రహించిన రైతన్న నిరసనబాట పట్టాడు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
రుణాల పేరిట వసూళ్లు
Corruption_manatelangana1కెరిమెరి సహకార సంఘంలో ఉన్న రైతులకు రుణాలు ఇప్పించేందుకు సంస్థలోని ఉద్యోగి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.4 వేల పైనే వసూలు చేసి నట్లు ఆరోపణలు విన పడుతున్నాయి. ఈ మేరకు కేలి (కే) గ్రామంలోనే 15 మంది రైతుల వద్ద నుండి వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త రుణాల కోసం వసూళ్ల పర్వం కొనసాగించినట్లు తెలుస్తోంది. కాగా రుణాలు ఎంతకీ రాకపోవడంతో డబ్బులు చెల్లించినవారు రుణాల విష యమై ప్రశ్నించడం, ఇంతలోనే ఎరువుల వ్యవహారం బయటపడటంతో కుడితిలో పడ్డ ఎలుకలా సంబంధిత అధికారి పరిస్థితి తయారైనట్లు సమాచారం. అక్రమ వ్యవహారం బయటపడటంతో శుక్రవారం సహ కార సంఘ బ్యాంకు తెరుచుకోలేదు. ఈ విషయం రైతులకు తెలియడంతో తాము చెల్లించిన విషయాలను బయటకు చెప్పుకుంటున్నారు.
ఫిర్యాదు చేస్తాం
కెరమెరి సహకార పరపతి సం ఘంలో జరుగుతున్న అక్ర మాలపై గతంలోనే జనరల్ బాడీ మీటింగ్‌లో పలుమార్లు చెప్పాం. అయినా పట్టించు కోలేదు. దీనిపై ఉన్న తాధికారులు స్పందించక పోవడంతోనే ఇలా జరిగింది. ఇకనైనా చర్యలు చేపట్టకపోతే రైతులకు అన్యాయం జరుగుతుంది. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.
– ఎంపిపి మాచర్ల గణేష్
న్యాయం చేయండి
Corruption_manatelanganaఖరీఫ్‌లో కష్టాల పాలైన రైతుకు అవినీతి అధికారులతో ఆ కష్టాలు పుండు మీద కుట్రలా మారాయి. కెరమెరి మండలానికి రావాల్సిన 2వేల ఎరువుల బస్తాలు నగదును అధికారి వాడుకోవడం వల్లనే రాలేదు. దీంతో వందల మంది రైతులు ఎరువుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.
– సర్పంచ్ రాథోడ్ సుందర్ సింగ్