Search
Friday 21 September 2018
  • :
  • :

‘ ఇంట్లో పనితోపాటు.. వ్యభిచారం చేయమన్నారు ’

Breaking-Newsహైదరాబాద్: ఉద్యోగం కోసం సౌదీకి వెళ్లిన రాష్ట్రానికి చెందిన ఓ మహిళ సౌదీషేక్‌ల చెర నుంచి క్షేమంగా బయటపడింది. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఉస్నాబేగం మధ్యవర్తుల ద్వారా ఉద్యోగం చేసే నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత గానీ ఆమెకు అర్థంకాలేదు..తనను పంపించింది పనిచేయడానికి మాత్రమేకాక వ్యభిచారం చేయడానికి కూడా అని. 25వేల రియాల్‌కు తనను మధ్యవర్తులు అక్కడి షేక్‌కు అమ్మేశారని, అక్కడ ఆమె ఇంటిపనితోపాటు వ్యభిచారం చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. వారు చెప్పినట్లు మహిళ వినకపోవడంతో ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనుకున్న షేక్‌లు ఆమెను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. షేక్‌ల చెరనుంచి తప్పించుకొన్న ఉస్మాబేగం సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఎంబసీ అధికారులు ఉస్నాబేగంను హైదరాబాద్‌కు పంపారు. బాధితురాలు మాట్లాడుతూ… తనను మధ్యవర్తులు ఉద్యోగం కోసం తీసుకెళ్లి వ్యభిచారంలోకి నెట్టే ప్రయత్నం చేశారని వాపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ముఠా తనను 25వేల రియాల్‌కు షేక్‌లకు అమ్మెసినట్లు తెలిపింది.

Comments

comments