Home పెద్దపల్లి ‘ఫీల్డు అసిస్టెంట్ ’అక్రమాల భాగోతం..!

‘ఫీల్డు అసిస్టెంట్ ’అక్రమాల భాగోతం..!

bribery2

కమాన్‌పూర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం క్రింద రొంపికుంట గ్రామంలో 2016 సంవత్సరంలో నిర్వహించిన పనులపై గత నాలుగు రోజులుగా గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించిన సామాజిక తనిఖీ బృందం తనిఖీని పూర్తి చేసి గురువారం జిపి ఆవరణలో గ్రామసభను నిర్వహించారు. ఈ సామాజిక తనిఖీలో పెద్ద మొత్తంలో క్షేత్ర సహయకుడు పులిపాక రమేష్, మేట్లు చేసిన అవినీతి, అక్రమాలను సామాజిక తనిఖీ బృంద గుర్తించారు. బ్యాంకు పెమెంట్‌కు ముందు రెండు ఫీడర్ ఛానల్ కాలువలకు సంబంధించి పనులు చేపట్టకున్నా కూలీలు పని చేసినట్లు మస్టర్లు సృష్టించి రూ. 20 వేలకు పైగా డబ్బులను ఫిల్డు అసిస్టెంట్ స్వాహ చేసినట్లు తనిఖీ బృందం గుర్తించడం జరిగింది. అంతే కాకుండా పెద్ద మొత్తంలో ప్రతి మస్టర్‌లో ఒకరు, ఇద్దరు కూలీలు నాలుగు, ఐదు రోజులు పనికి వచ్చినట్లు సంతకాలు లేకున్నా పెమెంట్స్ చేయడం దీంతో రూ. వేలాల్లో అక్రమాలు జరిగినట్లు తనిఖీ బృందం గుర్తించారు.

మండుటెండల్లో కూలీల నీడ కోసం ప్రభుత్వం పంపించిన టార్ఫలిన్లలో 13 టార్ఫలిన్ల జాడ లేవని, క్షేత్ర సహయకుడు దుర్వినియోగం చేశాడని తెలిసింది. గతంలో ఇజిఎస్ క్రింద చేపట్టిన ఐఎస్‌ఎల్ నిర్మాణాలకు బిల్లులు ఇప్పిస్తానని ఒక్కో లబ్దిదారు వద్ద రూ. వెయ్యి, ఇంకుండు గుంత బిల్లులు ఇప్పిస్తానని ఒక్కో లబ్దిదారు వద్ద రూ. 500ల చోప్పున లక్షల్లో వసూలు చేశాడని గ్రామస్థులు ఆరోపించారు. వాస్తవంగా పని చేసిన ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించకుండా, పనికి రాని తనతో కుమ్మకైన కోంత మంది కూలీలకు నిత్యం హజర్లు వేస్తూ ఆ వేతనాల మొత్తాన్ని వారితో కలిసి పంచుకున్నట్లు తనిఖీలో తేట తెల్లమయ్యింది.

పని ప్రదేశాల్లో హజరైన కూలీల సంతకాలు తీసుకోవాల్సిన క్షేత్ర సహయకుడు తన ఇంటి వద్ద  పోర్జరీ సంతకాలతో తనకు నచ్చిన, ఇష్టం వచ్చిన కూలీలు పనికి హజరైనట్లు మస్టర్ రోల్స్ తయారు చేసి, క్షేత్ర సహయకుడు అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీ బృందం గుర్తించింది. పెద్ద మొత్తంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సదురు క్షేత్ర సహయకుడు పులిపాక రమేష్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించి, అతని స్థానంలో మరోకరిని నియామించాలని కోరుతూ టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా కోల నర్సాగౌడ్, చింధం సతీష్, కొండి అనిల్‌గౌడ్, రఘు, నల్లగోండ భూమయ్య, కుందారపు శంకర్, గుమ్మడి అనిల్, గన్నెవరపు కోమురయ్యలతో పాటు పెద్ద మొత్తంలో గ్రామస్థులు, ఉపాధి కూలీలు వ్రాత పూర్వకంగా సామాజిక తనిఖీ గ్రామసభకు వచ్చిన పరిశీలకులకు తమ ఫిర్యాదును అందజేశారు. ఈ గ్రామసభలో సర్పంచ్ పులిపాక శారద, ఎంపిటిసి పులిపాక పుష్ప, ఉపసర్పంచ్ ఉప్పరి మొండయ్యలతో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.