Home నిజామాబాద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలన

 Field surveying on the implementation of central schemes

మనతెలంగాణ/నిజామాబాద్: సెంట్రల్ సెక్రటేరియేట్ సర్వీసులో సెక్షన్ అధికారులుగా పనిచేస్తున్న వారు జిల్లాలో ఈ నెల 28 నుండి ఆగస్టు 24 వరకు క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావును మర్యాదపూర్వకం గా కలిసారు. సెంట్రల్ సెక్రటరీయేట్‌లో వివిధ శాఖల్లో పనిచేసిన వారు కేంద్ర ప్రభుత్వం పథకాలు, రాష్ట్ర పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. ఇక్కడికి వచ్చిన సెక్షన్ అధికారులను జిల్లా కలెక్టర్ ఒక్కొక్కరికి ఒక పథకాన్ని కేటాయించారు. పూనం చౌదరికి బేటి పడావో, బేటి బచావో, కెసిఆర్ కిట్లు రాష్ట్ర వినిత్‌కుమార్ స్వచ్ఛభారత్ అభియాన్, టిఎస్, ఐపాస్, సంజయ్‌కుమార్ మిశ్రా, గ్రామ స్వరాజ్ అభియాన్ మిషన్ భగీరథ రంజీవ్ సక్సెనా, కస్తూర్బా బాలికల విద్యాలయాల, మిషన్ భగీరథ ఈ పథకాలు ఏ విధంగా అమలు జరుగుచున్నాయో పరిశీలన చేస్తారని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల అవసరాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సారధ్యం లో సంక్షేమం, అభివృద్ధ్ది పథకాలు వినూత్నంగా అమలు చేస్తున్నందున ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రభుత్వ దవాఖానలో డెలివరీ శాతం పెరిగేందుకు అమలు చేస్తున్న పథకం కెసిఆర్, అమ్మ ఒడి వల్ల ప్రభుత్వం ఆశించిన కంటే ఎక్కువగా ప్రభుత్వ దవాఖాన వైపు నమ్మకం ఏర్పడిందని కెసిఆర్ కిట్ వల్ల జిల్లాలో 61 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరిలు పెరిగినట్లు చెప్పారు. పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చిన ఔత్సహిక పారిశ్రామికవేత్తలు అనుమతులు సత్వరమే అందించేందుకు టిఎస్‌ఐపాస్, పథకం అమలు చేస్తున్నాయి. ఒక్క దరఖాస్తులో అన్ని శాఖలు సత్వరమే అనుమతులు జారీ చేస్తాయన్నారు. కాకతీయ కాలంలో నిర్మించిన గొలుసు కట్ట చెరువులను ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా దశల వారిగా చెరువు పూడికతీత కట్టల పటిష్టత పనులు చేయడం వల్ల ఆయకట్టు మరింత స్థిరికరణ అయిందన్నారు. ప్రతి ఇంటికి  సురక్షిత త్రాగునీరు అందించే పథకం మిషన్ భగీరథ అని ఈ పథకం మరో రెండు నెలలో పూర్తి కా వస్తుందని పథకాలు కలెక్టర్ వివరించారు. సం బంధిత శాఖ అధికారులు కూడా కావాల్సిన సమాచారం అందిస్తారని లయజర్ అధికారి జిల్లా మేనేజర్ వ్యవహరిస్తారని కలెక్టర్ చెప్పారు.