Search
Sunday 23 September 2018
  • :
  • :

క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ కొలంబియా ఇంటికి

fif

మాస్కో: ప్రపంచకప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉ త్కంఠభరితంగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇం గ్లండ్ పెనాల్టీ షూటౌట్‌లో 43 తేడాతో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. దీంతో అదనపు సమయాన్ని కేటాయించారు. ఇందులోనూ ఇద్దరు సమంగా నిలువడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యం అయ్యింది. ఇందులో పైచేయి సాధించిన ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. 2006 తర్వాత ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
హోరాహోరీ..
కొలంబియాఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన పోరు ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోరు నువ్వానేనా అన్నట్టు జరిగింది. ఇదే సమయంలో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య పలుసార్లు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు తరచూ గొడవలకు దిగడంతో రిఫరీకి ఇబ్బందికర పరిస్థితి తప్పలేదు. గతంలో జరిగిన మ్యాచ్‌లకు భిన్నంగా ఈసారి ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తిస్తూ ముందుకు సాగారు. ఇదే క్రమంలో ఒకరినొకరూ నెట్టుకుంటూ పలుసార్లు మ్యాచ్‌కు అడ్డంకులు సృష్టించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిఫరీ ఇరు జట్ల ఆటగాళ్లకు ఎల్లో కార్డులు ఇవ్వక తప్పలేదు. అయినా ఆటగాళ్లు తమ ఘర్షన పద్ధతిని మానుకోలేదు. దీంతో చివరి వరకు మ్యాచ్ ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే కొనసాగింది. కాగా, ప్రథమార్ధంలో రెండు జట్లు దూకుడుగా ఆడినా ఒక్క గోల్ కూడా సాధించలేక పోయాయి. ఇంగ్లండ్‌కు పలు అవకాశాలు లభించినా దాన్ని గోల్‌గా మలచడంలో సఫలం కాలేదు. కొలంబియా కూడా ఇంగ్లండ్‌కు దీటుగా ముందుకు సాగింది. ఇరు జట్లు కూడా సర్వం ఒడ్డడంతో పోరు నువ్వానేనా అన్నట్టు కొనసాగింది. ద్వితీయార్ధంలో కూడా హోరాహోరీ పోరు కొనసాగింది. అయితే ఈసారి ఇంగ్లండ్ కాస్త దూకుడును పెంచింది. పదేపదే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేస్తూ గోల్ కోసం ప్రయత్నించింది. ఎట్టకేలకు ఇంగ్లండ్ నిరీక్షణ ఫలించింది. కొలంబియా ఆటగాళ్లు దురుసుగా ప్రయత్నించడంతో రిఫరీ ఇంగ్లండ్‌కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. 57వ నిమిషంలో ఇది లభించింది. దీన్ని స్టార్ ఆటగాడు హ్యారి కేన్ గోల్‌గా మలచడంలో సఫలమయ్యాడు. ఈ టోర్నమెంట్‌లో కేన్‌కు ఇది రికార్డు స్థాయిలో ఆరో గోల్ కావడం విశేషం. తర్వాత కూడా ఇంగ్లండ్ దూకుడును కొనసాగించింది. మరోవైపు కొలంబియా కూడా స్కోరు సమం చేసేందుకు సర్వం ఒడ్డింది. కాగా, ఎంజూరి సమయంలో కొలంబియా చిరస్మరణీయ గోల్‌ను సాధించింది. 90+3 నిమిషంలో యెర్రి మీనా అద్భుత గోల్‌ను సాధించాడు. దీంతో మ్యాచ్ 11తో సమంగా ముగిసింది. ఈ పరిస్థితుల్లో 30 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. ఇందులో ఇరు జట్లు గోల్ సాధించడంలో విఫలమవ్వడంతో పెనాల్టీ షూటౌట్‌ల ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇందులో ఇంగ్లండ్ విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది.

Comments

comments