Search
Sunday 23 September 2018
  • :
  • :

ఫిఫా ప్రపంచకప్: బ్రెజిల్ గ్రాండ్ విక్టరీ

fifa

మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఇలో కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో బ్రెజిల్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌కు కొస్టారికా గట్టి పోటీ ఇచ్చింంది. రెండు జట్లు గోల్ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. మ్యాచ్ ప్రారంభమయిన 90 నిమిషాల వరకు ఇరుజట్లు ఒక్క గోల్ కూడా వేయలేదు. దీంతో ఈ మ్యాచ్ గోల్ లేని డ్రాగా ముగుస్తుందేమోనని భావించారు. కానీ (90+1) నిమిషంలో కొటినో సూపర్ గోల్‌తో బ్రెజిల్‌కు 1-0 అధిక్యాన్ని అందించాడు. అనంతరం బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్‌మార్ మరో గోల్‌తో బ్రెజిల్‌కు 2-0 అధిక్యాన్ని అందించాడు. దీంతో బ్రెజిల్ 2-0 తేడాతో కొస్టారికాపై ఘన విజయం సాధించింది.

Comments

comments