Search
Monday 24 September 2018
  • :
  • :

వైభవంగా ఫిఫా వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీ

ff

మాస్కో: మాస్కోలోని లూజ్నికి స్టేడియం వేదికగా ఫిఫా వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌ స్మిత్, నిక్కీ జామ్ తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. స్టేడియంలో కళాకారుల ప్రదర్శన ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  ఫుట్‌బాల్ వరల్డ్‌కప్-2018 ఫైనల్ మ్యాచ్‌లో రసవత్తర పోరుకు  ఫ్రాన్స్, క్రొయేషియాలు సిద్ధమైయ్యాయి. తొలిసారి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన క్రొయేషియా ట్రోఫీ దక్కించుకొని చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. మరోవైపు ఫ్రాన్స్ రెండోసారి ట్రోఫీని  గెలువాలని  పట్టుదలగా ఉంది. ఫ్రాన్స్ తొలిసారిగా 1998లో ఛాంపియన్ గా నిలిచింది.

Comments

comments