Home తాజా వార్తలు ఫ్రాన్స్ x క్రొయేషియా

ఫ్రాన్స్ x క్రొయేషియా

 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 2-1తో గెలుపు 

నిర్ధారిత సమయానికి రెండు జట్లు 1-1తో సమం
ఎక్స్‌ట్రా టైమ్‌లో నిర్ణాయక గోల్ చేసిన మరియో మాండ్జుకిక్

fifa

మాస్కో: క్రొయేషియా, ఇంగ్లాండ్‌ను బుధవారం 21తో ఓడించి తొలిసారిగా ఫిఫా ప్రపంచకప్ 2018 ఫైనల్‌లో చేరింది. నిర్ధారిత సమయానికి రెండు జట్లు 11తో సమంగా నిలిచాయి. మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌లో…109వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మాండ్జుకిక్ నిర్ణయాత్మక గోల్‌ను కొట్టడంతో ఫలితం తేలింది.
ఆట మొదలైన ఐదు నిమిషాలకే ఇంగ్లాండ్ ఆటగాడు ట్రిఫియర్ ఫ్రీకిక్‌తో గోల్ చేయడంతో ఆదిలో ఇంగ్లాండ్ 10తో ఆధిక్యతను సాధించింది. కానీ 68వ నిమిషంలో క్రొయేసియా ఆటగాడు ఫెరిసిక్ గోల్ చేయడంతో స్కోరు 11తో సమమం అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన పెరిసిక్ క్రొయేషియా జట్టులో ఆశలు నెలకొల్పాడు. గంటసేపు క్రొయేషియా నిరుత్సాహంగానే ఆడుతున్నప్పుడు అతడు ఆశలు రేకెత్తించాడు. దాంతో క్రొయేషియా పుంజుకుంది. నిర్ధారిత సమయం ముగిసే వరకు రెండు జట్లు సమంగానే కొనసాగాయి. తర్వాత ఇచ్చిన అదనపు సమయంలోని రెండో హాఫ్ టైమ్‌లో క్రొయేషియా ఆటగాడు మాండ్జుకిక్ 109వ నిమిషంలో గోల్ చేసి గెలుపును సొంతం చేసుకున్నాడు. ఇక క్రొయేషియా జూలై 15న ఫ్రాన్స్ జట్టుతో ఫైనల్‌లో తలపడనున్నది. సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్, క్రొయేషియా జట్ల మధ్య చాలా ఉత్సాహంగా కొనసాగింది. తొలి ఐదు నిమిషాల్లోనే ఇంగ్లాండ్‌కు ఫ్రీకిక్ లభించింది. దానిని క్రియరేన్ టిపియర్ గోల్‌గా మలిచి ఇంగ్లాండ్ జట్టుకు 10 ఆధిక్యాన్ని సాధించి పెట్టాడు. అతడు కొట్టిన గోల్ ఎంత బలంగా ఉండిందంటే ప్రత్యర్థి జట్టు గోల్‌కీపర్‌కు దానిని అడ్డుకునే అవకాశమే దక్కలేదు. ట్రిపియర్‌కిది తొలి అంతర్జాతీయ గోల్. ఇది గడిచిన కొంత సమాయానికి క్రొయేషియా కార్నర్ అవకాశాన్ని పొందింది. కానీ ఇంగ్లాండ్ డిఫెన్స్ ఈ ముప్పును ఎదుర్కొంది. ఇంగ్లాండ్‌కు కూడా తర్వాత కార్నర్ అవకాశం లభించింది. ఎష్లే యంగ్ షాట్‌ను తీసుకున్నాడు. దానిని మెంగ్యూర్ గోల్ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది కాస్తా క్రాస్‌బార్‌పైకి వెళ్లిపోయింది. 17వ నిమిషంలో క్రొయేసియా స్టార్ ఆటగాడు మోడరిక్ మంచి పొడవైన పాస్ చేశాడు. కానీ దాన్ని కలెక్ట్ చేసుకోలేదు. 20వ నిమిషంలో రెబిక్ గోల్ ఫీల్డ్ బయట నుంచి ప్రయత్నించాడు. కానీ జాన్ స్టోన్స్ దానిని నిష్ఫలం చేశాడు. దీని తర్వాత క్రొయేషియాకు చెందిన సుబాసిక్ తప్పుగా పాస్ చేయడంతో ఇంగ్లాండ్‌కు చెందిన రహీమ్‌కు బంతి దొరికింది. దాంతో అతడు బంతిని కెప్టెన్ హేరి కేన్ దిక్కుకు వేగంగా తీసుకెళ్లాడు. కానీ అసిస్టెంట్ రిఫరీ షాట్ కొట్టకముందే హాఫ్ సైడ్‌గా దానిని నిర్ధారించాడు. 32వ నిమిషంలో క్రొయేషియాకు చెందిన యేంటే రెబిక్ ఇంగ్లాండ్ గోల్ దిశలో గట్టి షాట్ కొట్టాడు. కానీ ప్రత్యర్థి గోల్‌కీపర్ జార్డన్ పికఫోర్డ్ దానిని చక్కగా కాచ్‌చేసి నిషలం చేశాడు. ఇంగ్లాండ్ జట్టు ఎక్కువసేపు దూకుడుగా ఆడడంతో క్రొయేషియా జట్టు గోల్ కాకుండా కాపాడుకోడానికి పాటుపడింది. క్రొయేషియా కూడా దూకుడుగా ఆడింది. కానీ దాని దూకుడులో అంత ఉధృతి కనిపించలేదు. ఆట తొలి అర్ధ భాగం వరకు ఇంగ్లాండ్ 10తోనే ఆధిక్యతలో కొనసాగింది.
రెండో సెషన్‌లో..
రెండో అర్ధభాగంలో క్రొయేషియాకు దూకుడుగా ఆడే అవకాశం ల భించింది. కానీ గోల్ ఫీల్డ్ లోపల రెబిక్ బంతిపై నియంత్రణను కో ల్పోయాడు. 48వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మాండ్జుకిక్ కు, 54వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు వాకర్‌కు ఎల్లో కార్డ్ చూ యించారు. క్రొయేషియాకు అనతి కాలంలోనే త్రోఇన్ అవకాశం లభించింది. రెబిక్ బంతిని ఇంగ్లాండ్ బాక్స్‌లోపలికి విసిరాడు. కానీ అది పోస్ట్‌కు చాలా దూరంగా పడ్డంతో గోల్ చేసే అవకాశం లభించలేదు. 12వ నిమిషంలో ఇంగ్లాండ్‌కు కార్నర్ అవకాశం లభించింది. ట్రిపియర్ దానిని తీసుకున్నాడు. అయితే లోవరేన్ ఆ ముప్పును తప్పించేశాడు. 68వ నిమిషంలో ఇవాన్ పెరిసిక్ గోల్ చేసి క్రొయేషియా స్కోరును ఇంగ్లాండ్‌కు సమానం చేశాడు. అతడు కొట్టిన గోల్ ఎంత వేగంగా దూసుకొచ్చిందంటే ఇంగ్లాండ్ గోల్‌కీపర్ దానిని ప్రేక్షకుడి మాదిరి చూస్తు ఉండిపోయాడు. దీని తర్వాత పెరిసిక్‌కు మరో అవకాశం లభించింది. కానీ అతడు కొట్టిన షాట్ గోల్ బార్‌ను తాకి వెనక్కి వచ్చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మార్పు చేసింది. రహీమ్ స్థానంలో మార్క్ రష్‌ఫోర్డ్‌ను బరిలోకి దించింది.

ff

శోకసంద్రంలో ఇంగ్లండ్ అభిమానులు
తమ జట్టు ఫైనల్లోకి చేరుతుందనే ఎంతో ఆశతో ఆటను ప్రత్యక్షంగా వీక్షించెందుకు అక్కడి గ్రౌండ్‌కు వచ్చిన, టీవిల్లో వీక్షించిన ఇంగ్లండ్ అభిమానులు క్రొయేషియా చేతిలో 2-1తో ఓడిపోవడంతో బోరున విలపించారు. వారేకాకుండా జట్టు సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. అంచనాలు లేని జట్టు చేతిలో పరాజయండపాలవడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోయారు.