Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

గెలిచి నిలిచింది

ff

జర్మనీ ఆశలు సజీవం
 స్వీడన్‌పై ఉత్కంఠ విజయం

మాస్కో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ నాకౌట్ ఆశలు సజీవంగా నిలిచాయి. గ్రూప్‌ఎఫ్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి స్వీడన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జర్మనీ 21 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఎక్స్‌ట్రా ఇంజ్యూరి టైమ్‌లో స్టార్ ఆటగాడు టోనీ క్రూస్ సాధించిన చిరస్మరణీయ గోల్‌తో జర్మనీ విజయం అందుకుంది. ఈ గెలుపుతో జర్మనీ నాకౌట్ అవకాశాలను నిలబెట్టుకుంది. ఎక్స్‌ట్రా ఇంజ్యూరీ టైమ్ ప్రారంభమై నాలుగు నిమిషాలు గడిచిన ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమని అందరు భావించారు. అయితే 90+5 నిమిషంలో లభించిన ఫ్రీకిక్ జర్మనీకి వరంగా మారింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న క్రూస్ గోల్ నమోదు చేశాడు. దీంతో జర్మనీ సంచలన విజయంతో ఊపిరి పీల్చుకుంది. చివరి నిమిషంలో మ్యాచ్ చేజార్చుకున్న స్వీడన్ కంగుతింది. జర్మనీ విజయంతో గ్రూప్‌ఎఫ్‌లో నాకౌట్ బెర్త్ కోసం హోరాహోరీ నెలకొంది. మెక్సికో ఇప్పటికే రెండు విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలువగా, స్వీడన్, జర్మనీ చెరో విజయంతో ఉన్నాయి. మరోవైపు దక్షిణ కొరియా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలై నాకౌట్ రేసు నుంచి                      వైదొలిగింది.

హోరాహోరీ..
స్వీడన్‌జర్మనీల మధ్య ప్రారంభం నుంచే హోరాహోరీ పోరాటం కొనసాగింది. టోర్నమెంట్ హాట్ ఫేవరెట్‌గా పరిగణిస్తున్న జర్మనీ ఈ మ్యాచ్‌లో కూడా తడబడింది. స్వీడన్ అద్భుత ఆటతో జర్మనీని ముప్పుతిప్పలు పెట్టింది. దూకుడుగా ఆడుతూ ప్రపంచ చాంపియన్‌కు చుక్కలు చూపించింది. స్వీడన్ జోరును ప్రదర్శించడంతో జర్మనీకి గోల్స్ సాధించడం కుదురలేదు. ఒకటి రెండు అవకాశాలు లభించినా ఫలితం లేకుండా పోయింది. పటిష్టమైన డిఫెన్స్‌తో స్వీడన్ ప్రత్యర్థి జట్టు దూకుడును అడ్డుకుంది. బంతి ఎక్కువ శాతం జర్మనీ ఆధీనంలోనే ఉన్నా గోల్ మాత్రం చేయలేక పోయింది. స్వీడన్ ఆటగాళ్లు అద్భుత సమన్వయంతో ఆడుతూ ప్రత్యర్థికి ఛాన్స్ దక్కనియ్యలేదు. మరోవైపు 32వ నిమిషంలో స్వీడన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్టార్ ఆటగాడు ఓలా టైవోనెన్ అద్భుత గోల్‌తో స్వీడన్‌కు పైచేయి అందించాడు. సెంటర్ బాక్స్ నుంచి లెఫ్ట్ కాన్నర్ దిశగా చిరస్మరణీయ గోల్ చేసి జర్మనీకి షాక్ ఇచ్చాడు. తర్వాత కూడా స్వీడన్ గోల్ కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ప్రథమార్ధంలో 01తో వెనుకబడిన జర్మనీ సెకండ్ హాఫ్‌లో దూకుడును ప్రదర్శించింది. అటాకింగ్ గేమ్ ఆడుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో 48వ నిమిషంలో తొలి గోల్ సాధించి స్కోరును సమం చేసింది. మార్కొ ర్యూస్ ఈ గోల్ చేశాడు. తర్వాత కూడా రెండు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా పోరాడాయి. అయితే పటిష్టమైన డిఫెన్స్‌తో నిర్ణీత సమయం ముగిసే లోగా ఒక్క గోల్ కూడా లభించలేదు. కానీ, ఎక్స్‌ట్రా ఇంజ్యూరీ టైమ్‌లో టోనీ క్రూస్ చేసిన గోల్‌తో జర్మనీ సంచలన విజయాన్ని అందుకుంది. కాగా, ప్రపంచకప్‌లో ఇలా చివరి నిమిషంలో విజయం సాధించడం జర్మనీకి ఇదే తొలిసారి. ఈ గెలుపుతో జర్మనీ నాకౌట్ ఆశలు సజీవంగా నిలిచాయి.

Comments

comments