Search
Tuesday 20 November 2018
  • :
  • :

సెమీస్‌లో క్రొయేసియా

ff

 క్వార్టర్స్‌లోనే రష్యా ఔట్
సోచి: సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించాలని భావించిన రష్యా ఆశలు ఆవిరయ్యా యి. శనివారం అర్ధరాత్రి క్రొయేసియాతో జరిగిన క్వార్టర్ ఫైన ల్లో రష్యా ఓటమి పాలైంది. పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేసియా 43 తేడాతో ఆతిథ్య రష్యా జట్టును ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో క్రొయేసియా మాజీ విజేత ఇంగ్లండ్‌తో తపలడుతుంది. క్రొయేసియా తో జరిగిన మ్యాచ్‌లో రష్యా అంచనాలకు మించి పోరాట పటిమను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు పట్టు నిలబెట్టుకున్న క్రొయేసియా సెమీస్‌కు చేరుకుంది. మరోవైపు భారీ ఆశలతో క్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగిన రష్యా అనూహ్యంగా ఓటమి పాలైంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు రష్యాపై ఎవరికి పెద్దగా ఆశలు లేవు. అయితే సొంత అభిమానుల మధ్య రష్యా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. ఒక్కో జట్టును ఓడిస్తూ ముందుకు సాగింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బలమైన స్పెయిన్‌పై చారిత్రక విజయం సాధించింది. ఇక, క్రొయేసియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కూడా చివరి వరకు విజయం కోసం పోరాడింది. అయితే పెనాల్టీ షూటౌట్‌లో రష్యాకు ఓట మి తప్పలేదు. మరోవైపు ఏమాత్రం అంచనాలు లేకుండా ప్ర పంచకప్ బరిలోకి దిగిన క్రొయేసియా మ్యాచ్ మ్యాచ్‌కు రాటు దేలుకుంటూ ముందుకు సాగింది. లీగ్ దశలో అజేయంగా నిలిచింది. ఇదే క్రమంలో బలమైన అర్జెంటీనాను 30తో చిత్తు చేసి పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన డెన్మార్క్‌ను కంగుతినిపించింది. తాజాగా క్వార్టర్ ఫైనల్లో రష్యాపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది.
ప్రారంభం నుంచే…
రష్యాక్రొయేసియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం నుంచే నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇరు జట్లు దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాయి. ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరూ దాడులు చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించాయి. ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో సమరం ఉత్కంఠభరితంగా మారింది. కాగా, తొలి గోల్‌ను ఆతిథ్య రష్యా సాధించింది. ఆట 31వ నిమిషంలో స్టార్ ఆటగాడు డెవిస్ చెరిషెవ్ కళ్లు చెదిరే గోల్ సాధించాడు. దీంతో రష్యా 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఆనందం రష్యాకు ఎక్కువ సేపు నిలువలేదు. మరో 8 నిమిషాల తర్వాత క్రొయేసియా స్కోరును సమం చేసింది. 39వ నిమిషంలో అండ్రెజ్ అద్భుత గోల్‌తో క్రొయేసియాను ఆదుకున్నాడు. ప్రథమార్ధంలో ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. ద్వితీయార్ధంలో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. కానీ, రెండు జట్లు కూడా మరో గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. దీంతో అదనపు సమయాన్ని కేటాయించారు. ఇందులో ఇరు జట్లు చెరో గోల్ సాధించాయి. 100వ నిమిషంలో క్రొయేసియా ఆటగాడు డొమాగ్ విడా అద్భుత గోల్‌తో క్రొయేసియాకు పైచేయి అందించాడు. కానీ 115వ నిమిషంలో ఆతిథ్య రష్యా రెండో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. అదనపు సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 22తో నిలిచాయి. ఈ పరిస్థితుల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇందులో క్రొయేసియా పైచేయి సాధించింది.

శోక సముద్రంలో అభిమానులు…

తమ జట్టు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టడాన్ని రష్యా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. స్టేడింయలోని అభిమానులు తమ జట్టు ఓటమి పాలుకాగానే బోరున విలపించారు. మరోవైపు టివిల ముందు మ్యాచ్‌ను తిలకించిన లక్షలాది మంది ఫుట్‌బాల్ ప్రేమికులు కూడా జట్టు ఓటమిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పలు నగరాల్లో టివిల ముందు మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులు జట్టు ఓటమి పాలవ్వగానే నిరాశలో మునిగి పోయారు. గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌ను కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు క్రొయేసియాలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది సంబరాల్లో మునిగి పోయారు.

Comments

comments