Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఇంగ్లండ్ అదరహో…

fw

మాస్కో: రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇం గ్లండ్ జోరు కొనసాగిస్తోంది. గ్రూప్‌జిలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-1 గోల్స్ తేడాతో పనామాను చిత్తు చేసింది. ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. అంతేగాక ఈ ప్రపంచకప్‌లో అత్యధికంగా ఆరు గోల్స్ చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. పసికూన పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. కెప్టెన్ హ్యా రి కేన్ హ్యాట్రిక్‌తో సహా మూడు గోల్స్ చేసి ఇంగ్లండ్‌కు ఘన విజయం అందించాడు. ప్రథమార్ధంలో ఏకంగా 50 ఆధిక్యంలో నిలిచి సంచలనం సృష్టిచింది. ఈ విజయంతో ఇం గ్లండ్ ప్రపంచకప్ నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఇదే గ్రూప్ నుంచి బెల్జియం కూడా నాకౌట్‌కు దూసుకెళ్లింది. ప నామా, ట్యునీసియాలు నాకౌట్ నుంచి నిష్క్రమించాయి.
ప్రారంభం నుంచే..
ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా పరిగణిస్తున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. పనామా ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో డిఫెండర్ జాన్ స్టోన్స్ ఆరో నిమిషంలోనే జట్టుకు మొదటి గోల్ సాధించి పెట్టాడు. తర్వాత ఇంగ్లండ్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అద్భుత ఆటతో పసికూన పనామాను హడలెత్తించింది. కెప్టెన్ హ్యారి కేన్ ఈ దశలో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అతని దూకుడుతో పనామా ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యారు. దీని నుంచి కోలుకోవడం పనామాకు శక్తి కి మించిన పనిగా మారింది. మరోవైపు 22వ నిమిషంలో ఇంగ్లండ్ రెండో గోల్‌ను సాధించింది. కెప్టెన్ కేన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టు ఆధిక్యాన్ని 20కు పెంచా డు. కొద్ది సేపటికే జెస్సి లింగార్డ్ జట్టుకు మూడో గోల్ అం దించాడు. 36వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాళ్లను ఛేదించేకుంటూ వెళ్లిన లింగార్డ్ అద్భుత గోల్‌ను నమోదు చేశాడు. మరో నాలుగు నిమిషాల తర్వాత జాన్ స్టోన్స్ తన రెండో గో ల్‌ను సాధించాడు. దీంతో ఇంగ్లండ్ ఆధిక్యం 40కు చేరిం ది. ఇదిలావుండగా ప్రథమార్ధం చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ కేన్ గోల్‌గా మలచడంలో సఫలమయ్యాడు. దీంతో తొ లి హాఫ్ ఇంగ్లండ్ 50తో తిరుగులేని ఆధిక్యాన్ని అందుకుంది. కాగా, ద్వితీయార్ధంలో మాత్రం పనామా కాస్త మెరుగ్గా ఆడింది. ఇం గ్లండ్ నిలువరిస్తూ గోల్స్ వ ర్షం కురువకుండా చూసింది. అయితే ఆట 60వ నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ కేన్ తన మూడో గోల్‌ను నమోదు చేశాడు. ఇది మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఆరో గోల్ కావడం విశేషం. తర్వాత ఇంగ్లండ్‌కు మరో గోల్ చేసే అవకాశం దక్కలేదు. పనామా అద్భుత ఆటతో ఇంగ్లండ్ గో ల్ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంది. అంతేగాక 78వ నిమిషంలో పనామా తన తొలి గోల్‌ను సాధించింది. ఫెలిప్ బలోయ్ ఈ చారిత్రక గోల్ సాధించాడు. ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో పనామాకు ఇదే మొదటి గోల్ కావడం విశేషం. కా .గా, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన ఇంగ్లండ్ 61తో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.

Comments

comments