Home తాజా వార్తలు త్వరలో ఐదో ఆటకు అనుమతి!?

త్వరలో ఐదో ఆటకు అనుమతి!?

Theatre-Openహైదరాబాద్ : చిన్న సినిమాల ఉనికిని నిలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదో ఆటకు త్వరలోనే అనుమతులు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. దీంతో పాటు నగరంలోని కీలక బస్టాండుల్లో మినీ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ ప్రస్థానం, పరిపాలన విధానంపై ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన పాటను ఆయన ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేవారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సినిమాలకు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.