Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రామ్‌చరణ్‌తో అయిదోసారి..?

8989రామ్‌చరణ్ తన తాజా చిత్రం ‘బ్రూస్‌లీ’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఇది చివరి దశలో ఉండగానే చరణ్ తదుపరి సినిమాకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే తమిళంలో వచ్చి సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ రీమేక్‌లో రామ్‌చరణ్ నటించనున్న విషయం తెలిసిందే. ‘బ్రూస్‌లీ’ నిర్మిస్తున్న డివివి దానయ్య ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను తీసుకున్నాడు. ఆయన చరణ్‌తో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇదిలాఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కాజల్‌తో చర్చలు కూడా జరిపినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. హీరోయిన్ ఇంకా ఫైనల్ కాకపోయినా ఈ కాంబినేషన్ అందరినీ చర్చించుకునేలా చేసింది. ఎందుకంటే ఇప్పటికే రామ్‌చరణ్-కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర, నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ అంటే మరో హిట్టే అని మెగా అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఎంతో ప్రత్యేకమైనది…
పవన్‌కల్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. కెమెరామెన్ జయంత్ విన్సెంట్ ఈ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో సినిమా ఆగిపోయింది. ఆతర్వాత ఆథుర్ విల్సన్‌ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. సినిమాలో పవన్ హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తన కెరీర్‌లోనే ఈ సినిమా క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంటుందని కాజల్ పేర్కొంది. తనకు మరో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని ఈ అందాలభామ తెలిపింది. హాట్‌బ్యూటీ లక్ష్మీరాయ్ ఐటమ్‌సాంగ్‌లో పవన్‌తో స్టెప్పులు వేయనుంది. సినిమా షూటింగ్ ఆలస్యమవుతుండడంతో సినిమా విడుదల కూడా వాయిదాపడుతోంది. ముందుగా అనుకున్న విధంగా సంక్రాంతి పండుగకు కాకుండా వచ్చే ఏడాది వేసవిలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమా ‘గబ్బర్‌సింగ్’ మూవీకి సీక్వెల్ కాదు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు.

Comments

comments