Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

విద్యారంగం కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు

Untitled-1మధిర: నేటి తరంలో విద్యారంగం కార్పొ రేటీకరణ జరుగుతుండటంతో విద్య కొందరికి మా త్రమే అందుతుందని, మిగిలిన వారిలో విద్యకు దూరంగా ఉంటున్నారని, కార్పొ రేటీ కరణకు వ్యతిరేకంగా భవిష్యత్‌లో ఎఐ ఎస్‌ఎఫ ఆధ్వర్యంలో నిర్వహించే పోరా టాలకు విద్యార్థులకు సిద్ధంగా ఉండాలని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి రావి శివ రామకృష్ణ పేర్కొన్నారు. మధిర పట్టణంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఎఐ ఎస్‌ఎఫ్ 24వ జిల్లా మహాసభల ప్రతి నిధుల సభను ప్రారంభించి ఆయన మాట్లా డుతూ విద్యారంగానికి కేంద్ర, రాష్ట్రప్ర భుత్వాలు కేటాయించాల్సిన విధంగా బడ్జెట్‌ను కేటాయించకపోవటంతో విద్యా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయ బడు తుందని, విద్యారంగాన్ని కాషాయికరణ చేసేందుకు కేంద్రప్రభుత్వం వేగంగా పావులు కదుపు తుందని, విద్యారంగంలో మతోన్మా దాన్ని చొప్పించి విద్యార్థుల్లో మతోన్మాద బావాలను పెంచేందుకు కావాల్సిన ప్రణా ళికలు ఇప్పటికే రూపొందించటం జరి గిందని, దానిలో భాగంగా విదేశీ యూ నివర్సిటీల్లో తీసు కువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తు న్నారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించారని, ఉద్యమ సమయంలో ఎన్నికల ప్రణాళికల్లో కేసీఆర్ విద్యార్థులకు అడగని వరాలు కూడా ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఆచరణలో మాత్రం అమలు చేయటం లేదని పేర్కొ న్నారు. కేజి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినా అమ లులో మాత్రం ఇంత వరకూ కార్యరూ పందా ల్చలేదని, అదేవిధంగా విద్యా ర్థులకు గత రెండు సంవత్సరాల నుంచి రావాల్సిన స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయం బర్స్‌మెంట్ అందక పోవ టంతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, ప్రభు త్వం ఇప్ప టికైనా స్పందించి విద్యార్థులకు బకాయిలు ఉన్నా స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయం బర్స్‌మెంట్లు వెంటనే చెల్లిం చాలని, లేకపోతే ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహి స్తామని తెలిపారు. కరీంనగర్‌లో జరిగే ఎఐఎస్‌ఎఫ్ తెలంగాణ మొట్టమొదటి రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్య్రకమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జమ్ముల జితేంద్రరెడ్డి, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్, మాజీ నాయకులు మర్రి మన్మధ రావు, తోట రామాంజనేయులు, నీరుకొండ మురళీ, శ్రావణ్‌కుమార్, నాయకులు బెజ వాడ గోపాలరావు, ఇటికాల రామకృష్ణ, బండి గణేష్‌రెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Comments

comments