Search
Sunday 23 September 2018
  • :
  • :

తగవులతో తాళం

తగవులతో తాళం పడ్డ మహిళ మండలి
తారాస్థాయికి చేరిన మహిళల వివాదం
రోడ్డుపైనే విఒ సమావేశాలు
పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న పంచాయతీ

Fight

ఇల్లంతకుంట: ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా మహిళ సాధికారత కోసం అడుగులు వేస్తూ ,  ప్రతి గ్రామంలో మహిళ సంఘభవనం ఏర్పాటుకు కృషిచేస్తుంటే..ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో రెండు మహిళ గ్రూపూల మద్య చోటు చేసుకున్న చిన్న సంఘటన చిలికి చిలికి గాలివానల మారింది. దీంతో మహిళ మండలి సంఘభ         వనానికి తాళం పడ్డ సంఘటన చోటు చేసుకుంది. గాలిపెల్లి గ్రామానికి ఎంతో ఉద్యమ చరిత్ర ఉంది. అలాంటి గ్రామంలో మహిళల మద్య నెలకొన్న సమస్య ఊరిలో అగ్గిరాజుకుంటుంది. గత ఆరు నెలలుగా మహిళ సంఘాల మద్య నెలకొన్న చిచ్చు మండల ప్రజాప్రతినిధులకు, అధికారులకు నిద్రపట్టనివ్వండం లేదు.

గ్రామంలో మొత్తం 62 మహిళ గ్రూపులు ఉంటాయి. వీటికి గానూ సుమారు 700 లకు పైగా మహిళ సభ్యులు ఉంటారు. అయితే గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం నవ చైతన్య గ్రుపూతో మహిళ మండలిని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి గ్రామానికి చెందిన శ్యామలదేవి అధ్యక్షురాలిగా కొనసాగుతూ వస్తుంది. అయితే నవచైతన్య గ్రూపు భ్యులు, ప్రభుత్వ సహాయంతో భవనాన్ని నిర్మించారు. అప్పటి నుండి గ్రుపూ సభ్యులు విఓ సమావేశాలను అక్కడే నిర్వహించుకుంటూ వస్తున్నారు. అయితే గ్రామంలోని మహిళలు తమకు కూడా సభ్యత్వం ఇవ్వాలని, కోరారు. అయితే దీనికి ఓ వర్గం వారు సుముఖత చూపించారు. దీంతో చిన్నపాటి గొడవ చివరకు మహిళ మండలి భవనానికి తాళం వేసేలా చేసింది. మహిళ సంఘాల సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి పంచాయతీలకు వరకు చేరుకున్నారు.

 ఈ విషయమై స్థానిక ఎమ్మెలే రసమయి బాలకిషన్, ఎంపిపి, జడ్పీటీసిల దృష్టికి తీసుకెళ్లారు. అయిన ఓ వర్గం వారు మా నిధులతోనే భవనాన్నికట్టించామని మేము మీ కు సభ్యత్వం ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో అగ్గిరాజుకుంది. ఓ వర్గం వారు ఈ సంఘటన పై హైకొర్టును ఆశ్రయించారు. ఎంపిడిఓకు నోటిసులు జారిఅయ్యాయి. మరో వర్గం వారు మహిళమండలి భవనం ప్రభుత్వ నిధులతో కట్టించిందని, అందు లో మోజార్టీ మహిళలకు సభ్యత్వం ఇవ్వాలని, సంఘ భవనాన్ని సమావేశాలకు వాడుకోవాలని, కిరాణం, హోటల్‌లకు అద్దెకివ్వడం ఎందని ప్రశ్నించారు. గత నెల రోజుల క్రితం మహిళ మండలి భవనాన్ని తాళం వేసి రెండు వర్గాల వారిని శాంతిపజేసే ప్రయత్నం చేశారు. బుధవారం ఓ వర్గం వారు మహిళ మండలి భవనం తాళం పగలకొట్టారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం వారు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి, భవనంలో ఉన్న సామాగ్రిని బయట పడేసారు. రెండు వర్గాల గొడవ ఒకరి పై ఒకరు ఫీర్యాదు చేసుకునే స్థాయికి పోయింది. మోజార్టీ మహిళ సంఘాల వర్గం వారు రూ. 1లక్షకు పైగా డబ్బులు పోయాయని ఫీర్యాదు చేశారు. ఈ గొడవతో గ్రామంలో ఒక్క సారిగా ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ గొడవకు తెర వేయాలని ప్రజలు కొరుతున్నారు.

Comments

comments