Home తాజా వార్తలు కెసిఆర్ ఆడిన నాటకం బయటపడింది…

కెసిఆర్ ఆడిన నాటకం బయటపడింది…

Komati-Reddy-Venkat-Reddy

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ఆడిన నాటకం బయటపడిందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విరుచుకపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం మీద సిఎం కెసిఆర్‌కు నమ్మకం లేదన్నారు. కెసిఆర్ హామీలు గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో లేకపోవడంతో తాము ధర్నాకు దిగామని పేర్కొన్నారు. అసెంబ్లీలో తాము ఫైట్ చేసింది ప్రజల కోసమేనని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేసిందని దుయ్యబట్టారు. సంపత్, కోమటి రెడ్డి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించకపోతే కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు అందరూ రాజీనామా చేయాలని కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత జానా రెడ్డి తమ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.  గతంలో గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాల రద్దు విషయంలో  హైకోర్టులో వారికి ఊరట లభించింది.