Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పెద్ద నోట్ల రద్దుపై ఉద్యమిస్తాం

– కెసిఆర్ కేంద్రానికి వత్తాసుగా మారాడు
– రోజూవారీగా ఉద్యమాలు చేపడుతాం
-డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి
MONEY

మన తెలంగాణ/సంగారెడ్డి అర్బన్ : పెద్దనోట్ల రద్దుపై ఉద్యమం చేపడుతామని, ముందే ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి నాయకులకు నోట్ల రద్దు విషయం తెలుపడంతో భారీగా డిపాజిట్లు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని డిసిసి జిల్లా అధ్యక్షురాలు సునీతాలకా్ష్మరెడ్డి విమర్శించారు. సోమ వారం సంగారెడ్డిలోని ఐబిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ దేశంలో ఒక్క శాతం ఉన్నా కుబేరులను దృష్టిలో ఉంచుకొని 99 శాతం ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో స్విస్ బ్యాంక్‌లో ఉన్న నల్లధనాన్ని వెనిక్కి తెచ్చి ప్రజలకు పంచుతానని చెప్పిన మోడీ ఇప్పుడు మాటమార్చి పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టారన్నారు. భారత్‌లో 85 శాతం ఉపయోగంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో గత రెండు నెలలుగా పింఛన్లు అందక వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర సమస్యలు ఎదుర్కొం టున్నారని, సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కెసిఆర్ నోట్ల రద్దు విషయంలో ఏమీ మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతు న్నాడని ఆరోపించారు. ఈ పెద్ద నోట్ల రద్దు విషయాన్ని నిరసిస్తూ 6న మెదక్‌లో, 7న దుబ్బాక, సిధ్దిపేటలో, 9న సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు చేపట్టను న్నామని తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, జిల్ల ఇంచార్జీ ఉజ్మా, శంకర్‌యాదవ్, శంకర్‌రెడ్డి, రఘుగౌడ్, సాభేర్, తోపాజీ అనంతకిషన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments