Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఆ ఫీచర్ య్యూట్యూబ్‌లోకి వచ్చేసింది..!

Youtube

మనకు నచ్చిన వీడియోలను చూసుకొవాలంటే య్యూట్యూబ్ ఉపయోగించాల్సిందే.. ప్రపంచలోని అన్ని విషయాలకు సంబంధించిన వీడియోలు మనకు య్యూట్యూబ్ లో లభిస్తాయి. అందరికీ ఎంతో సుపరిచితమైన య్యూట్యూబ్ లోకి తాజాగా ఓ అద్దిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు య్యూట్యూబ్ నుంచి ఏదైనా వీడియో షేర్ చేయాలంటే వేరే యాప్ లను ఆశ్రయించాల్సిందే. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా.. యాప్ ద్వారానే ఇతరులకు వీడియోలు షేర్ చేసుకొనే సౌకర్యాన్ని య్యూట్యూబ్ కల్పించింది. తొలుత ఈ ఫీచర్ ని కెనెడాలో ప్రవేశపెట్టింది తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ని అందుబాటులోకి తెస్తున్నట్లు య్యూట్యూబ్ ప్రకటించింది. గతేడాది నుంచే దీన్ని పరిశీలిస్తున్నామని, వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పలు మార్పులు చేర్పులూ చేశామని యూట్యూబ్‌ పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా య్యూట్యూబ్ యాప్ నుంచే నేరుగా వీడియోలను స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోవాచ్చని సంస్థ పేర్కొంది. ఇంతకుముందులా వీడియోలను ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకునే వెసులుబాటూ ఉంది. త్వరలో అందించే అప్‌డేట్‌ ద్వారా ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

Comments

comments