Home తాజా వార్తలు భూ దొంగల అరెస్టు

భూ దొంగల అరెస్టు

Filed a complaint but police has arrested the accused still

కోర్టును బురిడీ కొట్టించి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేయడానికి యత్నించిన ముఠా
హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన పోలీసులు
విచారణ తప్పుదోవకు పోలీసులపైనే కేసు వేసిన న్యాయవాది

మనతెలంగాణ/సిటీబ్యూరో: హైకోర్టును తప్పుదోవపట్టించి ప్రభుత్వ భూమి కాజేయాలని చూసిన నలుగురు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జహీరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ అమ్జద్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన సయిద్ సాధిక్, కర్నాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన మహ్మద్ పటేల్, మహ్మద్ అబ్దుల్ ఘనిపై హైకోర్ట్ రిజిష్ట్రార్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ మండలం, గుడిమల్కాపూర్ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి 78 ఎకరాల 22 గుంటల భూమి కాజేసేందుకు చూసిన వీరిని అరెస్టు చేశారు. ప్రభుత్వ భూమి తమదని చెప్పి పేర్లు మార్చుకున్న నకిలీ వ్యక్తులు ఇక్బాల్ ఇస్లాం ఖాన్, నజముద్దీన్ ఇస్లాం ఖాన్, హబీబుద్దిన్ ఇస్లాం ఖాన్, ఇఫ్తికార్ ఇస్లాం ఖాన్ ప్రభుత్వ భూమి వీరిదేనని న్యాయవాది శైలేష్ సక్సేనా హైకోర్టులో పిటీషన్ వేశాడు. వీరి తరపున రిట్ పిటీషన్లు వేసి న్యాయవాది  శైలేష్ సక్సేనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్యంతర ఉత్తర్వులు కోర్టు నుంచి తీసుకువచ్చాడు. 2017 అక్టోబర్‌లో హైకోర్టు పిటీషన్లను కొట్టివేసి నకిలీ వ్యక్తులపై  కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో హైకోర్టు రిజిష్ట్రార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

అసలు సూత్రధారి న్యాయవాది  శైలేష్ సక్సేనాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత న్యాయవాది కేసు విచారణ తప్పుదోవ పట్టిం చేందుకు పోలీస్ అధికారులపై కేసులు వేశాడు. అంతేకాకుండా 14వ కోర్టులో పోలీస్ అధికారులపై ప్రైవేట్ కేసు వేశాడు. అంతేకాకుండా అయిజ్ అహ్మద్‌తో మరో ప్రైవేట్ కేసు కోర్టులో వేయించడంతో కేసు నమోదు చేయాల్సిందిగా మలక్‌పేట పోలీసులను కోర్టు ఆదేశిం చింది. నకిలీ వ్యక్తులతో భూమిని కాజేసేందుకు యత్నించడంతో ఈ రెండు పిటిష న్లను హైకోర్టు కొట్టివేసింది.  శైలేష్ సక్సేనా న్యాయవాది మహ్మద్ అబ్దుల్ ఘనిని కలిసి ఎల్‌బీనగర్ కోర్టులో భూమి కేసు పెండింగ్‌లో ఉందని, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని రూ.4,80,000 ఇస్తానని చెప్పి ఒప్పించాడు. రెవెన్యూ అధికారులతో రిసర్వే చేయించి తన పేరుపై వచ్చే విధంగా చేయాలని కోరాడు. ఘని, న్యాయవాది  శైలేష్ సక్సేనా ఇద్దరు స్నేహితులు. భోజగుట్టలో చాలా భూమి ఉందని దానిపై కేసులు కోర్టులో ఉన్నాయని, తనకు ముగ్గురు నమ్మకస్తులైన వ్యక్తులు కావాలని వారి పేరుపై భూమి బదిలీ చేయిస్తానని తెలిపాడు. అంతే కాకుండా వారికి పెద్దమొత్తంలో డబ్బుకూడా ఇస్తానని న్యాయవాది  శైలేష్ సక్సేనా ఘనికి నమ్మించాడు. దీనిని నమ్మిన న్యాయవాది మహ్మద్ గని జాహీరాబాద్‌కు చెందిన మహ్మద్ హ్మజద్, మహ్మద్ పటేల్, సయ్యద్ గఫూర్ హష్మిని కలిసి విషయం చెప్పాడు.

న్యాయవాది  శైలేష్ సక్సేనా, ఎంఏ ఘని ముగ్గురి ఆధార్ కార్డులు, ఫొటోలుతీసుకుని వారిపేర్లు, తండ్రి పేరు, చిరునామాలను కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌లోని ఓ ఆధార్ సెంటర్‌లో మార్చారు. వీటితో పాన్‌కార్డు, ఆధార్ కార్డు ఓటర్ ఐడీ కార్డు తీసుకున్నారు. తర్వాత రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్ సాధిక్‌ను కలిసి ముగ్గురుకి భూమి సమస్య ఉందని, ముగ్గురు ఇక్కడే  ఉంటున్నారని విచారణకు ఎవరైనా వస్తే చెప్పాలని చెప్పి ఒప్పించాడు. నజుముద్దిన్, హబీబ్, ఇఫ్తికార్ తమ బంధువులని ఇక్కడే ఉంటున్నారని చెప్పాలని కోరాడు.  తర్వాత విద్యుత్ బిల్లు తీసుకున్నాడు. ముగ్గురు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పోలీసు అధికారులపై ప్రైవేట్ పిటిషన్  వేశాడు.తర్వాత ముగ్గురు వ్యక్తుల పేరు మీద నగరంలోని బహదూర్‌పురలోని సిండికేట్ బ్యాంక్‌లో ఖాతా తెరిపించాడు. నకిలీ వ్యక్తులను పోలీసులు గుర్తించి విచారణ చేయగా మొత్తం విషయం బయటపడింది. విచారణ అధికారి కేఎన్ విజయ్ కుమార్ ఏసీపీ, ఎస్‌ఐ నయిముద్దిన్ ముగ్గురి అసలు ఆధార్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులు సేకరించి కోర్టు ముందు ఉంచడంతో వీరి అరెస్టుకు హైకోర్టు ఆదేశించింది.

Filed a complaint but police has arrested the accused still

Telangana news