Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

‘డేటింగ్’ అంటే నచ్చదు

trisha

వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో ఒడిదుడుకులుంటాయి. చేసే వృత్తికూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. జయాపజయాలు అనివార్యం. అయితే వ్యక్తిగత జీవితం తాలూకు ప్రభావం చేస్తున్న పనిపై పడకూడదు. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నటి గీతను అర్థం చేసుకున్నవాళ్లు పరిపక్వత సాధించినవాళ్లని పెద్దలు చెబుతుంటారు.

ఈ మాటలను అక్షరాలా అర్థం చేసుకుంది హీరోయిన్ త్రిష. గత ఏడాది పీటల వరకు వెళ్లిన పెళ్లి ఆగిపోయినా ఆమె ఏమాత్రం నిరాశ,నిస్పృహలకు గురికాలేదు. ‘ముందుంది మంచి కాలం’ అని అనుకుంది. కెరీర్ మీద దృష్టిపెట్టింది. వరుసగా సినిమాలు చేస్తున్న త్రిషను ‘డేటింగ్’ గురించి అడిగితే… “నాకు ఆ పదం అంటే నచ్చదు. డేటింగ్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే కుదురుతుందని అనుకోను. అమ్మాయి, అబ్బాయి సహజంగా కలిసి నడిస్తేనే బావుంటుంది. కానీ ఏదో ప్రణాళిక వేసుకుంటే చాలా కృత్రిమంగా ఉంటుంది”అని చెప్పుకొచ్చింది.

అలా సహజంగా తొలిసారి ఎవరితోనైనా కలిసి తిరిగారా అని అడగగా… “చదువుకునే రోజుల్లో క్లాస్‌మేట్ అయిన ఓ అబ్బాయి ఇంటికి వెళ్లాను. తను నా కోసం కష్టపడి వంట చేశాడు. ఏం వండాడో సరిగా గుర్తులేదు. కానీ నా దృష్టిలో వంటచేసే మగాళ్లు చాలా సెక్సీగా ఉంటారు”అని వివరించింది.

Comments

comments