Home తాజా వార్తలు త్రిషా ఒంటిపై ముచ్చటగా మూడో టాటూ

త్రిషా ఒంటిపై ముచ్చటగా మూడో టాటూ

Trisha-Tatooచెన్నై: నటీ త్రిషా ఒంటిపై ముచ్చటగా మూడో టాటూ వచ్చి చేరింది. ఈ సారి త్రిషా తన భుజంపై క్లాప్‌బోర్డు టాటూ వేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌తోపాటు, ఇన్‌స్టాగ్రామ్‌లోను పోస్ట్ చేశారు. దీంతో త్రిషా అభిమానులు ఈ ఫోటో చూసి ఫూల్ ఖుషి అవుతున్నారు. ఇంతకు ముందు త్రిషా యదాపై ఓ టాటూతో కుర్రాకారుని ఉర్రుతూగించారు. వర్షం సినిమాతో కుర్రాళ్ల కలల రాణిగా మారారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాలీవుడ్ నెంబర్‌వన్ స్థానాన్ని ఎంజాయ్ చేశారు. త్రిషా తన శరీరంపై మొదటి టాటూగా నెమో చేప కార్టున్‌ను టాటూగా వేయించుకున్నారు.