Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సినిమాగా ‘అబ్దుల్ కలాం’ జీవితగాధ!

ముంబయి : మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం జీవిత గాధను త్వరలో వెండితెరపై చూడవచ్చు. ‘డాక్టర్ అబ్దుల్ కలాం’ అనే పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 104 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశ పెట్టిన ఇస్రోకి అభినందనలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రం ఇంగ్లీష్‌లో రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పోస్టర్‌లో ఉంది. కాగా ఈ చిత్ర నటీనటులుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments