Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

‘బాహుబలి-2’కు ఫిలింఫేర్ అవార్డుల పంట

cini

ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి అవార్డు
ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ, ఉత్తమ నటిగా సాయి పల్లవిలకు ఫిలింఫేర్ పురస్కారాలు
కైకాల సత్యనారాయణకు జీవితకాల పురస్కారం

తారల తళుకుబెళుకుల మధ్య  65వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు ఈ వేడుకలో పాల్గొని మెరిసారు. అందమైన కథానాయికలు ఈ వేడుకలో సందడి చేసి మురిపించారు. ఇక దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలలో  ఎవరికి ఏ అవార్డులు దక్కుతాయోనని సోషల్ మీడియాతో పాటు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన  చర్చ జరిగింది. చివరికి ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించిన చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా వివిధ విభాగాల్లో ఫిల్మ్ అవార్డులను అందజేశారు. ఇక ముందునుంచి ఊహించిన విధంగానే తెలుగులో సింహ భాగం అవార్డులు ‘బాహుబలి-2’కు దక్కాయి. ఈ బ్లాక్‌బస్టర్ మూవీకి అవార్డుల పంట పండింది. అయితే ప్రభాస్‌కు అవార్డు రాకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇక  ‘ఫిదా’ చిత్రం కూడా ఈ అవార్డుల వేడుకలో సత్తా చాటింది. ఇక దక్షిణాదికి చెందిన వివిధ చిత్ర పరిశ్రమలకు సంబంధించి విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలుగులో…
ఉత్తమ చిత్రం ః బాహుబలిః ది కన్‌క్లూజన్
ఉత్తమ దర్శకుడు ః ఎస్.ఎస్.రాజమౌళి (బాహుబలిః ది కన్‌క్లూజన్)
ఉత్తమ నటుడు ః విజయ్ దేవరకొండ (అర్జున్‌రెడ్డి)
ఉత్తమ నటి ః సాయిపల్లవి (ఫిదా)
ఉత్తమ నటుడు (క్రిటిక్) ః వెంకటేష్ (గురు)
ఉత్తమ నటి (క్రిటిక్) ః రితికా సింగ్ (గురు)
ఉత్తమ నటి (తొలి పరిచయం) ః కల్యాణి ప్రియదర్శన్ (హలో)
ఉత్తమ సహాయ నటుడు ః రానా (బాహుబలిః ది కన్‌క్లూజన్)
ఉత్తమ సహాయ నటి ః రమ్యకృష్ణ (బాహుబలిః ది కన్‌క్లూజన్)
ఉత్తమ సంగీత దర్శకుడు ః ఎం.ఎం.కీరవాణి (బాహుబలిః ది కన్‌క్లూజన్)
ఉత్తమ సాహిత్య రచయిత ః ఎం.ఎం.కీరవాణి (బాహుబలి ః ది కన్‌క్లూజన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు ః హేమచంద్ర (ఫిదా)
ఉత్తమ నేపథ్య గాయని ః మధుప్రియ (ఫిదా)
జీవిత సాఫల్య పురస్కారం ః కైకాల సత్యనారాయణ
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌ః సాబూ సిరిల్ (బాహుబలిః ది కన్‌క్లూజన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ః కెకె సెంథిల్ కుమార్ (బాహుబలిః ది కన్‌క్లూజన్)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ః విజె శేఖర్ (ఖైదీ నంబర్ 150)

తమిళంలో…
ఉత్తమ చిత్రం ః అరం
ఉత్తమ దర్శకుడు ః పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేధ)
ఉత్తమ నటుడు ః విజయ్ సేతుపతి (విక్రమ్ వేధ)
ఉత్తమ నటి ః నయనతార (అరం)
ఉత్తమ నటుడు (క్రిటిక్) ః కార్తి (తీరన్ అడిగరాం ఒండ్రు), ఆర్.మాధవన్ (విక్రమ్ వేధ)
ఉత్తమ నటి (క్రిటిక్) ః అదితి బాలన్ (అరువి)
ఉత్తమ సహాయ నటుడు ః ప్రసన్న (తిరుట్టుపాయెల్ 2)
ఉత్తమ సహాయ నటి ః నిత్యామీనన్ (మెర్సల్)
ఉత్తమ సంగీత దర్శకుడు ః ఎ.ఆర్.రెహమాన్ (మెర్సల్)
కన్నడలో…
ఉత్తమ చిత్రం ః ఒండు మొట్టేయ కథె
ఉత్తమ దర్శకుడు ః తరుణ్ సుధీర్ (చౌక)
ఉత్తమ నటుడు ః పునీత్ రాజ్‌కుమార్ (రాజ్‌కుమార)
ఉత్తమ నటి ః శృతిహరిహరణ్ (బ్యూటిఫుల్ మనసుగలు)
ఉత్తమ నటుడు (క్రిటిక్) ః ధనుంజయ (అల్లమ)
ఉత్తమ నటి (క్రిటిక్) ః శ్రద్ధా శ్రీనాథ్ (ఆపరేషన్ అల్లెమెల్లం)
ఉత్తమ సహాయనటుడు ః పి.రవిశంకర్ (కాలేజ్ కుమార్)
ఉత్తమ సహాయ నటిః భవానీ ప్రకాశ్ (ఉర్వి)
ఉత్తమ సంగీత దర్శకుడు ః బిజె భారత్ (బ్యూటిఫుల్ మనసుగలు)
మలయాళంలో…
ఉత్తమ చిత్రం ః తొందిముతలం ధృక్‌సాక్షం
ఉత్తమ దర్శకుడు ః దినేష్ పోతెన్ (తొందిముతలం ధృక్‌సాక్షం)
ఉత్తమ నటుడు ః ఫాహద్ ఫాజిల్ (తొందిముతలం ధృక్‌సాక్షం)
ఉత్తమ నటి ః పార్వతి (టేకాఫ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్) ః టోవినో థామస్ (మాయానది)
ఉత్తమ నటి (క్రిటిక్) ః మంజూ వారియర్ (ఉదారణం సుజాత)
ఉత్తమ సహాయ నటుడు ః అలెన్సియర్ (తొందిముతలం ధృక్‌సాక్షం)
ఉత్తమ సహాయ నటి ః శాంతికృష్ణ (జందుకలుదే నట్టిల్ ఒరు ఇదవెల్ల)
ఉత్తమ సంగీత దర్శకుడు ః రెక్స్ విజయన్ (మాయానది)

Comments

comments