Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

విపత్తు, అగ్నిమాపక శాఖలో 391 పోస్టులు

Finance department permission to recruitment Of 391 posts In fire department

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, టిఎస్‌పిఎస్‌సి, డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ                                                      ఆర్థికశాఖ ఉత్తర్వులు 

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ విపత్తు అగ్నిమాపక శాఖలో వివిధ కేటగిరీలలోని 391 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఈ పోస్టులను తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, టిఎస్‌పిఎస్‌సి, డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీ ద్వారా నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ లేవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 33 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను, 284 మంది ఫైర్‌మెన్లను, టిఎస్‌పిఎస్‌సి ద్వారా 18 మంది జూనియర్ అసిస్టెంట్లను, డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీ ద్వారా 56 మంది డ్రైవర్ ఆపరేటర్లను మొత్తంగా 391 పోస్టులను నియమించనున్నారు. ఇటీవలనే రాష్ట్ర హోం శాఖ తెలంగాణ విపత్తు అగ్నిమాపకలో వివిధ కేటగిరీలలో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. నాలుగు కేటగిరీలలో ఉన్న సుమారు 391 పోస్టుల  భర్తీకి అనుమతివ్వాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలను పంపింది. వాటిని పరిశీలించిన ఆర్థిక శాఖ ఆ పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. కాగా నాలుగు కేటగిరీలకు చెందిన పోస్టులలో ఒక కేటగిరీ పోస్టులను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలని సూచించింది.

Comments

comments