Home తాజా వార్తలు ఆస్ట్రేలియా పర్యటనకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్

ఆస్ట్రేలియా పర్యటనకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్

Etela-rajenderమన తెలంగాణ/హైదరాబాద్‌ః కొత్తగా ప్రవేశపెట్టిన వస్తువు, సేవల పన్ను (జిఎస్‌టి) విధానంపై అధ్యయనం చేసేందుకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో కూడిన బృందం శనివారం అర్ధరాత్రి ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. అక్టోబర్ 6వరకు ఆస్ట్రేలియాలో పర్యటించి అక్కడ అనుసరిస్తున్న జిఎస్‌టి విధానం తీరును పరిశీలించనున్నారు. జిఎస్‌టి పద్ధతిలో పన్నులు విధించినప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది.? రాష్ట్రాల ఆదాయానికి నష్టం కలగకుండా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? అనే పలు అంశాలను ఈటెల రాజేందర్ బృందం అధ్యయనం చేయనుంది. కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి పన్నుల విధానం ప్రవేశపెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. కాని రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలపై పెత్తనం చెలాయించే విధంగా జిఎస్‌టి ఉండకూడదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న తరుణంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను కేంద్రం వెంటనే చెల్లించకుండా జాప్యం చేయడం సరైందని కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనల విడుదల చేశారు.