Home సినిమా అనారోగ్యంతో బాధపడుతున్న సినీ పాత్రికేయుడికి ఆర్థిక సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న సినీ పాత్రికేయుడికి ఆర్థిక సహాయం

MAAకొన్ని నెలల క్రితం ఈటివి  జర్నలిస్ట్ సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్సపొందారు. ఖరీదైన వైద్యం అందించేందుకు ఆయన కుటుంబం ఆర్థికంగా బలమైనది కాదు. దీంతో జర్నలిస్టుల చొరవతో  పాత్రికేయుడు సత్యనారాయణకు తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి 9 లక్షలు, ఏపి సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి 7 లక్షలు అందజేయడం జరిగింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపి సిఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసిన 7 లక్షల చెక్కును ప్రముఖ నటుడు, ఎంపి మురళీమోహన్ పాత్రికేయుడు సత్యనారాయణకు అందజేశారు. ఇక మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తరపున గతంలో ఈ జర్నలిస్ట్‌కు 50 వేలు అందజేయగా ఇప్పుడు మరో 50 వేల చెక్కును అందజేశారు. ఇక సత్యనారాయణ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని మురళీమోహన్‌తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, అనితా చౌదరి ఆకాంక్షించారు. ఇక సత్యనారాయణకు ఆర్థికంగా అండగా నిలిచిన వారిలో మంచులక్ష్మి, క్రిష్, దిల్‌రాజు, మారుతి, ఠాగూర్ మధు, నాగశౌర్య, మహేష్ కోనేరు, బెల్లంకొండ శీను, సి.కళ్యాణ్ తదితరులు ఉన్నారు.

Financial Assistance to cinema journalist

Telangana News