Search
Wednesday 26 September 2018
  • :
  • :

యువతి వివాహనికి గ్రామస్థుల ఆర్థిక సహాయం

Financial help of villagers for wedding of the young woman
కాల్వశ్రీరాంపూర్‌: మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన నందగిరి రమ్య అనే నిరుపేద యువతి వివాహనికి గ్రామస్థులు రూ॥ 25 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఉదారత భావన్ని చాటుకున్నారు. రమ్య తల్లితండ్రులు గత 15 సంత్సరాల క్రితం మృతి చెందగా, అప్పటి నుండి రమ్య నాన్నమ్మ నందగిరి సత్యమ్మ దగ్గరే ఉంటుంది. రమ్య దీనపరిస్థిని చూసిన గ్రామస్థులు తల కొంత జమచేసి రమ్య వివాహం ఖర్చుల నిమిత్తం ఆదివారం రమ్య నాన్నమ్మ సత్యమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా రమ్య గ్రామస్థులకు కృతజ్ఞలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసు, ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి, మనోహర్‌రెడ్డి ,మహేందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమేష్, సుదాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Comments

comments