Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చిన్నారి కాలేయ శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం

AlluArjunఅప్పుడే లోకం చూసిన చిన్నారికి ప్రాణం పోయే లోపం ఉందని తెలిస్తే తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. భీమవరం ప్రాంతానికి చెందిన నాగరాజు, దుర్గా ప్రశాంతి దంపతులు ఇలాంటి బాధనే నాలుగు నెలలుగా అనుభవిస్తూ వస్తున్నారు. వీరికి గత జూన్‌లో అబ్బాయి పుట్టాడు. అయితే బిడ్డ పుట్టిన ఆనందం కాసేపటికే ఆవిరైంది. ఆ చిన్నారికి పెద్ద లోపం ఉందని చెప్పారు వైద్యులు. కాలేయం నుంచి క్లోమ రసం స్రవించే నాళం మూసుకుపో యిందని పరీక్షల్లో తేలింది. దీంతో కాలేయం మార్చాల్సిందేనని వైద్యులు తేల్చిచెప్పారు. అయితే తన కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వడానికి తండ్రి నాగరాజు ముందుకొచ్చినా… ఆ శస్త్ర చికిత్స చేయడానికి భారీ ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. రూ.30 లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. అయితే వైద్యులు, తెలిసిన వాళ్ల సహకారంతో పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్స్ రెండింటి కోసం వాళ్లు ధరఖాస్తు చేసుకున్నారు. అదృష్టం కొద్ది పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 13 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షలు మంజూరైంది. అయినప్పటికీ ఇంకా డబ్బు అవసరం కాగా ఈ విషయం తెలుసుకున్న హీరో అల్లుఅర్జున్ తన వంతుగా సాయం 8 లక్ష రూపాయలను అందజేశాడు. దీంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యలు చిన్నారికి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉన్నాడు.

Comments

comments