Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఎంఆర్‌పి లేకుంటే ఇకామర్స్ కంపెనీలపై జరిమానా

bsns2

న్యూఢిల్లీ: ఇ-కామర్స్ సంస్థలు ఇకపై ధరలు సరిగ్గా కనిపించేలా చేయాలి.. లేకపోయినట్లయితే జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపై ఇకామర్స్ సంస్థలు కొత్త నిబంధనలను పాటించని పక్షంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈమేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ హెచ్చరించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్యాక్ చేసిన వస్తువులపై ఎంఆర్‌పితో పాటు ఇతర వివరాలూ పొందుపరచాలని ఆశాఖ ఆదేశాలు జారీ చేసింది. లీగల్ మెట్రాలజీ సెక్షన్ 36 నిబంధన కింద వస్తువు గడువు ముగింపు(ఎక్సై్పరీ), తయారీ తేదీ, తయారీదారుల వివరాలు జతచేయాలని సూచించింది. నిబంధనలు అతిక్రమించినట్లయితే ఈ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిబంధనలను ఉల్లఘించిన సంస్థలపై వారిపై చర్యలు తీసుకుంటామని ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ చట్టం ప్రకారం వస్తువులపై ఎంఆర్‌పి ముద్రించని కంపెనీలను మొదటిసారి పట్టుకున్నట్లయితే రూ.25వేలు, రెండోసారి గుర్తిస్తే రూ. 50వేలు, మూడో సారి గుర్తిస్తే రూ. లక్ష జరిమానాతోపాటు ఏడాది జైలు శిక్ష పడే అవకాశముందని అధికారి వెల్లడించారు. వినియోగదారులనుంచి వస్తు న్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం ఈ నిర్ణయానికి వచ్చినట్లు  అధికారులు తెలిపారు.

Comments

comments