Home తాజా వార్తలు యాంకర్ ప్రదీప్‌కు జరిమానా

యాంకర్ ప్రదీప్‌కు జరిమానా

Anchor-Pradeep

హైదరాబాద్ : కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా డిసెంబరు 31న మోతాదుకు మించిన మద్యం తాగి పోలీసులకు పట్టుబడిన యాంకర్ ప్రదీప్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల పోలీసులు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు తన తండ్రితో కలిసి హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయన నాంపల్లి కోర్టులో హాజరు అయ్యారు. కోర్టు ఆయనకు రూ.2,100 జరిమానా విధించింది. మూడేళ్ల పాటు ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

Fine to Anchor Pradeep in Court