Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

బంగ్లాదేశ్ బౌలర్ కు జరిమానా!

rubelదుబాయ్: బంగ్లాదేశ్ బౌలర్ రుబెల్ హసన్‌కు ఐసిసి ఒక డీమెరిట్ పాయింట్ జరిమానా విధించింది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన మూడో వన్డేలో ఐసిసి కోడ్ ఆఫ్ కండెక్ట్‌లో ఆర్టికల్ 2.1.4ను ఉల్లంఘించినందుకు  ఐసిసి ఈ జరిమానా విధించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇతరులను అవమానిస్తు, తిడుతూ వ్యాఖ్యలు చేసిన కారణంగా అతనికి ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నట్లు ఐసిసి పేర్కొంది. వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రుబెల్ హసన్‌ బౌలింగ్ చేసిన 28వ ఓవర్‌లో బంతి బ్యాట్స్‌మెన్ బ్యాట్‌కి తగిలి ఎడ్జ్ తీసుకొని బౌండరీ వైపు పరుగులు పెట్టింది. దీంతో కోపాన్ని తట్టుకోలేక పోయిన రుబెల్ ఓ అసభ్య పదాన్ని వాడాడు. దీంతో అది స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఆ తర్వాత మ్యాచ్ అనంతరం రుబెల్ తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఐసిసి మ్యాచ్ రెఫరీ ఎమిరేట్స్ ఎలైట్ పానల్ సభ్యులు క్రిస్ బోర్డ్ రుబెల్‌కు ఈ శిక్ష విధించాల్సిందిగా ప్రతిపాదించారు.దీంతో రుబెల్‌కి ఒక లెవెల్ పాయింట్ పెనాల్టీని విధించడంతో పాటు మ్యాచ్‌ ఫీజ్‌లో 50శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు.

Comments

comments