Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జెట్, ఇండిగో, స్పైస్‌జెట్‌లపై జరిమానా

bs

 కార్గొ రవాణా చార్జీలను సవరించినందుకు సిసిఐ చర్యలు

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి మూడు విమానయాన సంస్థలపై సిసిఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) రూ.55 కోట్ల జరిమానా విధించింది. ఇంధన సర్‌చార్జీలను సవరించారనే ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టింది. ఎఫ్‌ఎస్‌సి(ఫ్యూయెల్ సర్‌ఛార్జీ) రేట్లలో తప్పుడు విధానాలు అవలంభించినందుకు గాను ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్(ఇండిగో పేరెంట్ కంపెనీ), స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా, గో ఎయిర్‌లైన్స్ సంస్థలపై ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇండస్ట్రీస్ కౌన్సిల్ కేసు దాఖలు చేసింది. ఈమేరకు సిసిఐ ఆదేశాలు జారీ చేసింది. సిసిఐ పేర్కొన్న ప్రకారం, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్‌లు రేట్ల విషయంలో తప్పుడు విధానాలను చేపట్టాయి. ఈమేరకు జెట్ ఎయిర్వేస్‌పై రూ.39.8 కోట్లు, ఇండిగోపై రూ.9.5 కోట్లు, స్పైస్‌జెట్‌పై 5.1 కోట్లు జరిమానా విధించినట్టు సిసిఐ ప్రకటించింది. అయితే సిసిఐ జరిమానాపై ఈ విమానయాన సంస్థలు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Comments

comments