Home స్కోర్ ఏదీ కలిసి రాలేదు

ఏదీ కలిసి రాలేదు

kohli

టీమిండియా సారథి కోహ్లి

జోహెన్నస్‌బర్గ్: నాలుగో వన్డేలో తమకు ఏదీ కలిసి రాలేదని, అందువల్లే ఓటమి తప్పలేదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అన్ని పరిణామాలు తమకు వ్యతిరేకంగా జరిగాయన్నాడు. ముందు గా తాము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రతికూల వా తావరణంతో ఆట ఆగి పోయిందన్నాడు. ఆట అలాగే కొ నసాగి ఉంటే తమ స్కోరు కనీసం 330 పరుగుల వరకు చేరేదన్నాడు. అయితే మ్యాచ్ ఆగిపోవడంతో ఆటగాళ్ల లయ తప్పిందన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో వర్షం తమ అవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు. కీలక సమయంలో వర్షం రావడం, ఓవర్లను కుదించడం ప్రత్యర్థి జ ట్టుకు కలిసి వచ్చిందన్నాడు. మ్యాచ్ పూర్తి ఓవర్ల పాటు కొనసాగి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదన్నాడు. లక్షం తగ్గడంతో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి తగ్గిందన్నాడు. దీంతో అంతకు ముందు వరకు ఉన్న భారీ ల క్షం భారం వారిపై లేకుండా పోయిందన్నాడు. దీంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝులిపించ గలిగారన్నాడు. డివిలియర్స్ ఆడింది కొంత సేపే అయినా అప్పటికే బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడంలో సఫలమయ్యాడన్నాడు. అతను చాహల్‌ను లక్షంగా చేసుకుని సాగించిన పోరాటం మ్యాచ్ గతిని మార్చిందనడంలో సందేహం లేదన్నాడు. దీనికి తోడు డేవిడ్ మిల్లర్ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయట పడడం కూడా సౌతాఫ్రికాకు కలిసి వచ్చిందన్నాడు. అతను క్లీన్ బౌల్డ్ అయినా నోబాల్ వల్ల బతికి పోయాడన్నాడు. అంతేగాక ఫ్రీహిట్ వల్ల క్యాచ్ ఔటైనా మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కిందన్నాడు. ఈ పరిణామం తమ నుంచి మ్యాచ్‌ను దూరం చేసిందన్నాడు. మరోవైపు భారత బౌలర్లు గాడి తప్పిన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కోలుకునేలా చేశారన్నాడు. దీంతోపాటు చెత్త ఫీల్డింగ్ కూడా తమ ఓటమికి మరో కారణమన్నాడు. వర్షం వల్ల మైదానం తడిగా మారడంతో ఫీల్డింగ్ చేసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయన్నాడు. ఆటగాళ్లు మైదానంలో సులువుగా కదలలేక పోయారన్నాడు.
అతనే దూరం చేశాడు…
ఈ మ్యాచ్‌లో క్లాసన్ బ్యాటింగ్‌ను ఎంత పొగిడిన తక్కువేనని కోహ్లి అన్నాడు. అతను కొట్టిన కొన్ని షాట్లు మ్యాచ్‌కే హైలైట్‌గా మారాయన్నాడు. అతని బ్యాటింగ్ తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. చాహల్, కుల్దీప్‌ల బంతులను అతను సిక్స్‌లు, ఫోర్లుగా మలిచిన తీరు చూడముచ్చటగా ఉందన్నాడు. మిల్లర్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడన్నాడు. అసాధారణ పోరాట పటిమను కనబరిచిన సౌతాఫ్రికానే ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అర్హురాలని కోహ్లి పేర్కొన్నాడు. కాగా, రానున్న రెండు వన్డేల్లో విజయమే లక్షంగా పెట్టుకున్నామన్నాడు. ఇందులో గెలుస్తామనే నమ్మకం తనకుందన్నాడు. ఈ ఓటమిని ఇంతటితో వదిలేసి రానున్న మ్యాచ్‌లకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతామని కోహ్లి స్పష్టం చేశాడు.

సౌతాఫ్రికాకు జరిమానా

sout

భారత్‌పై అద్భుత విజయంతో ఆనందంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) షాక్ ఇచ్చింది. భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా సౌతాఫ్రికా జట్టుకు జరిమానా విధిస్తూ ఐసిసి నిర్ణయం తీసుకుంది. సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మార్‌క్రామ్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతను ఐసిసి విధించింది. అంతేగాక జట్టు సభ్యులు ఒక్కోక్కరికి పది శాతం జరిమానా చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. కాగా, వచ్చే ఏడాది కాలంలో మార్‌క్రామ్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టు స్లో ఓవర్ రేట్‌కు కారణమైతే అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధిస్తామని ఐసిసి ప్రకటించింది. కాగా, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రతికూల వాతావరణం వల్ల సౌతాఫ్రికా బౌలర్లు వేగంగా బౌలింగ్ చేయలేక పోయారు. దీని ప్రభావంతో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి కాలేదు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐసిసి నిబంధనల ప్రకారం సౌతాఫ్రికా జట్టుపై జరిమానా విధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన విషయం విదితమే.