Home తాజా వార్తలు అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం

అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం

Bhopal-Fire-Accident

రాజేంద్ర నగర్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారమిచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి తెలిపారు.

Fire Accident at Attapur in Rangareddy 

Telangana news