Home తాజా వార్తలు జిహెచ్‌ఎంసి ఆఫీస్‌లో అగ్నిప్రమాదం..

జిహెచ్‌ఎంసి ఆఫీస్‌లో అగ్నిప్రమాదం..

fire-accident

హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో మొదటి అంతస్తు అకౌంట్ సెక్షన్ పూర్తిగా దగ్ధమైంది. అధికారుల సమాచారం మేరకు రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మేయర్ బొంతురామ్మోహన్ ఘటనా స్థలానికిచేరుకొని, ప్రమాదానికి గురైన భవనాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీస్ కేసు నమోదు చేయాలని జోనల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఒకే కాంప్లెక్స్‌లో పలు సర్కిల్ కార్యాలయాలతో ఇరుకు ఇరుకుగా ఉన్న జోనల్ కార్యాలయం నుంచి సర్కిల్ కార్యాలయాలను ఆయా ప్రాంతాల్లో పూర్తయిన భవనాలకు తరలించాలని ఆదేశించారు.