Home జాతీయ వార్తలు కుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం

కుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం

Fire Accident at Kumbh Mela Areaలక్నో : యుపిలోని ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా జరిగే ప్రదేశంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దిగంబర్‌ అకాడ శిబిరంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో అక్కడి తాత్కాలిక నిర్మాణాలు కొన్ని కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Fire Accident at Kumbh Mela Area