Home జాతీయ వార్తలు మదర్సాలో అగ్నిప్రమాదం

మదర్సాలో అగ్నిప్రమాదం

Madrasaయుపి : ముజఫర్‌నగర్ జిల్లా శురు గ్రామంలోని మదర్సాలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. మదర్సాలోని ఓ గదిలో గురువారం రాత్రి వెలుతురు కోసం క్యాండిల్ వెలిగించారు. రిఫ్రిజిరేటర్ క్యాండిల్‌కు దగ్గరగా ఉన్న సమయంలో మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Fire Accident at Madrasa