Home తాజా వార్తలు అమీర్ పేటలో అగ్నిప్రమాదం

అమీర్ పేటలో అగ్నిప్రమాదం

Fire-Accident

హైదరాబాద్: అమీర్ పేటలోని సంగీత మోటార్స్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపు నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ వెల్లడించినట్టు సమాచారం.