Home తాజా వార్తలు చట్నీస్ హోటల్‌లో అగ్నిప్రమాదం

చట్నీస్ హోటల్‌లో అగ్నిప్రమాదం

Fire accident in Niloufer Hospital

హైదరాబాద్: కూకట్‌పల్లి చట్నీస్ హోటల్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ నుంచి మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఒకే సారి మంటలు చెలరేగడంతో హోటల్ నుంచి కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.