ముంబయి: ముంబయిలోని ఓ ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. అంధేరీ శివారులోని ఈఎస్ఐ కామ్గర్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విపత్తు నిర్వహణ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 8 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురు రోగులు, సిబ్బంది మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.