Home Default హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

Fire Accidentహైదరాబాద్ : నగరంలోని రాణిగంజ్ లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మారుతి షోరూం మల్టీ వర్క్‌షాప్‌లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fire Accident in Hyderabad City on Saturday