Search
Wednesday 26 September 2018
  • :
  • :

భారీ అగ్ని ప్రమాదం 20 లక్షల ఆస్తినష్టం

fire

మనతెలంగాణ/మానవపాడు: మానవపాడు మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి. ఈ ప్రమాదంలో 15 గడ్డివాములు, 5 గుడిసెలు దగ్ధం కావడంతో పాటు 20 లక్షల అస్తినష్టం వాటిల్లింది. సాయంత్రం ఉన్నంటుండి రెండు గంటలపాటు భారీగా ఇదురు గాలులు రావడంతో ప్రమాదవశాత్తు అగ్ని వ్యాపించి మొదట ఎస్సి కాలనీలో ఉన్న గడ్డివాము, గుడిసె దగ్ధమైయింది. దీంతో గుడిసెలో ఉన్న రెండు ఆవులు మంటలకు కాలిపోయి మృతి చెందాయి. ఇదురు గాలులు అధికం కావడంతో నిప్పులు ఏగిరిపడి బిసి కాలనీలో ఉన్న గడ్డివాములు, గుడిసెలకు మంటలు వ్యాపించి కాలిబుడిదయ్యాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో గుడిసెలో నుంచి బయటకు పరుగులు తీశారు. గాలులకు మంటలు తీవ్రస్థాయిలో వ్యాపించడంతో ప్రజలు బిందెలు తీసుకుని నీటితో ఆర్పేందుకు ప్రయాత్నించిన ఫలించలేదు. ఒక్కదానికి ఒక్కటి గడ్డివాములు దగ్ధం కావడంతో మంటలు భారిగా వ్యాపించాయి. 15 గడ్డివాములు, 5 గుడిసెలు, రెండు మూగజీవలు మృతి చెందడంతో తీవ్రంగా నష్టం వాటీల్లింది. సూమారు 20 లక్షల వరకు అస్తినష్టం జరిగిందని ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు.

పైర్‌ఇంజన్ రెండు గంటలు అలస్యం…

గుడిసెలు, గడ్డివాములు దగ్ధమయ్యాయని రెండు గంటల ముందే ప్రజలు పైర్‌ఇంజన్‌కు సమాచారం ఇచ్చిన పైర్‌ఇంజన్ రావడంతో అలస్యం కావడంతో జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. గ్రామంలో మంటలు వ్యాపించి పూర్తిగా నష్టం జరిగింది. 7:30 గంటల ప్రాంతాంలో ఒక్క పైర్ ఇంజన్ మాత్రమే రావడంతో మంటలను ఆర్పాలేకపోయింది. దీనికి తోడు ఎస్సి కాలనీలో, బిసీ కాలనీలో మంటలు భారీగా ఉండటంతో రెండు కాలనీల ప్రజలు పైర్‌ఇంజన్ అధికారులతో కొద్ది మేరకు వాగ్వాంధం చేశారు. ఎప్పుడు లేన్నంతగా ఇదురు గాలులు, మంటలు రావడంతో గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండ్లు, గుడిసెల నుంచి ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. గ్రామస్థులంతా నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయాత్నించిన ఫలితం లేకుండా పోయిందని ప్రజలు లబోదిబోమన్నారు. ప్రభుత్వం స్పందించి అదుకోవాలని ప్రజలు కోరుతున్నారు…

Comments

comments