Home తాజా వార్తలు కాటేదాన్ లో అగ్నిప్రమాదం

కాటేదాన్ లో అగ్నిప్రమాదం

fire accident in katedan

రంగారెడ్డి: కాటేదాన్ పారిశ్రామికవాడలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గణేశ్‌నగర్ కాలనీలో గల ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంను నిర్వహిస్తున్నారని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.