Home తాజా వార్తలు రంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం: నలుగురి మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం: నలుగురి మృతి

FIREహైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహేశ్వరం మండలం మాంకాల్‌లో అసిత పరిశ్రమలో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కంపెనీలో ప్రమాదం జరుగుతున్నప్పుడు సుమారు 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తుంది. మృతులు ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.