Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జయలలిత బంగ్లాలో అగ్నిప్రమాదం

Fire

చెన్నై : చెన్నై నగరానికి 70-80 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గెస్ట్ హౌస్‌గా వినియోగించుకున్న సిరుతాపూర్ బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎక్కువగా పోయెస్ గార్డెన్‌లో ఉండే జయలలిత, అప్పుడప్పుడు విడిది కోసం మాత్రం ఈ బంగ్లాకు వెళ్లేవారు. జయ మృతి అనంతరం ఈ బంగ్లా శశికళ, దినకరన్ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంది. అయితే అన్నాడిఎంకె పార్టీ నుంచి దినకరన్ కుటుంబాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయ ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలు ఆ బంగ్లాలో ఉన్నాయని వార్తులు వెలువడుతున్నాయి. కాగా ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరి మంటలను అదుపు చేశారు. అయితే ఆస్తుల వివరాలు బయటకు రాకుండా ఎవరైన కుట్రలు పన్నుతున్నారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments