Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

హయత్ నగర్ లో అగ్ని ప్రమాదం

Fire Accident In Timber Depot At Chatrinaka Due To Short Circuit
హయత్‌నగర్‌: షార్ట్ సర్కూట్‌తో టింబర్ డిపో, బైక్ పాయింట్ సెంటర్ అగ్నికి అహుతి అయిన ఘటణ తుర్కయంజాల్ మున్సిపాలిటీ మున్గనూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఫైర్ ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… మున్గనూర్ మెయిన్ రోడ్డులో ఉన్న టింబర్ డిపోలో షార్ట్ సర్కూట్‌తో మంటలు చేలరెగాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకునే సమయానికి ప్రక్కన ఉన్న వినాయక బైక్ పాయింట్‌కు మంటలు వ్యాపించాయి. సర్విసింగ్ సెంటర్‌లో ఉన్న 4 పల్స్‌ర్‌ బైక్ లు, 2 పాషన్‌ప్లస్‌ బైక్ లు, 1 హోండ సిటి,1 హోండ డిలక్స్‌లకు మంటలు అంటుకోని 2గంటలకు పైగా మంటలు చేలరేగాయి, స్థానికులు పైర్ సిబ్బంది సహయంతో షటర్‌లను పగలగొట్టి మంటలను అదుపూలోకి తీసుకున్నారు. 9బైక్‌లు, సర్విసింగ్ సెంటర్‌లో ఉన్న విలువైన సామాను మంటల్లో కాలిపోయ్యాయి. విటి విలువ సుమారు 7లక్షలకు పైగా ఉంటుందని బైక్ పాయింట్ నిర్వహకుడు కల్కీ తెలిపారు. అదే విధంగా 2కట్టె మిషన్‌లు, డిపోలో ఉన్న కట్టెల విలువ సుమారు 3లక్షలు ఉంటుందని టింబర్ డిపో నిర్వహకుడు కృష్ణాచారి తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి సహయ సహకారాలు అందించాలని వారు విన్నవించారు.

Comments

comments